Asianet News TeluguAsianet News Telugu

చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Chilakaluripet assembly elections result 2024:  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించిన విడదల రజనీ మంత్రి అయ్యారు. దీంతో ఈసారి మాజీ మంత్రి, మంత్రి మధ్య పోటీ వుంటుందని అందరూ భావించారు. కానీ వైసిపి అధిష్టానం అనూహ్యంగా చిలకలూరిపేటలో మరో అభ్యర్థిని బరిలోకి దింపి అందరినీ ఆశ్చర్యపరిచింది.  

Chilakaluripet assembly elections result 2024 ... Andhra Pradesh Assembly Elections 2024 krj
Author
First Published Jun 4, 2024, 10:17 AM IST

Chilakaluripet assembly elections result 2024: చిలకలూరిపేటపై తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. అయితే ఇదే టిడిపి నుండి రాజకీయ నాయకురాలి ఎదిగిన విడదల రజని వైసిపిలో చేరడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ గురువుగా చెప్పుకున్న ప్రత్తిపాటి పుల్లారావుపై పోటీ చేసారు రజని. ఇలా  గురుశిష్యుల మధ్య సాగిన పోరులో శిష్యురాలిదే పైచేయిగా నిలిచింది. చిలకలూరిపేట నుండి మూడుసార్లు ఎమ్మెల్యే, అప్పటి మంత్రి పుల్లారావును ఓడించి నియోజకవర్గంలో మొదటిసారి వైసిపి జెండా ఎగరేసారు విడదల రజని. ఇలా మంత్రిని ఓడించిన రజనికి వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రిపదవి దక్కింది. 

చిలకలూరిపేట అసెంబ్లీలోని మండలాలు : 

చిలకలూరిపేట
నాదెండ్ల 
ఎడ్లపాడు 

చిలకలూరిపేట అసెంబ్లీ ఓటర్లు : 

చిలకలూరిపేటలో  మొత్తం ఓటర్ల సంఖ్య -  223976

పురుషులు - 107815

మహిళలు - 116125 

చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

చిలకలూరిపేట వైసిపి అభ్యర్థి :  

చిలకలూరిపేటలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజనిని కాదని మరో నేత  కావటి మనోహర్‌ నాయుడు  ను బరిలో దింపింది వైసిపి.  

చిలకలూరిపేట టిడిపి అభ్యర్థి : 

చిలకలూరిపేట నుండి మూడుసార్లు (1999, 2009,2014) ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాటి పుల్లారావుకే టిడిపి టికెట్ దక్కింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా మరోసారి ఆయనకే అవకాశం ఇచ్చింది టిడిపి. 

చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

 

చిలకలూరిపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కావటి శివ నాగ మనోహర్‌నాయుడుపై విజయం సాధించారు. ప్రత్తిపాటి పుల్లారావుకు 111062 ఓట్లు పోల్ కాగా, కావటి శివ నాగ మనోహర్ నాయుడుకు 77800 ఓట్లు పోలయ్యాయి.
 
చిలకలూరిపేట ఎన్నికల ఫలితాలు 2019 : 

నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 1,93,340 (86 శాతం) ఓట్లు పోలయ్యాయి. 

వైసిపి - విడదల రజని - 94,430 (50 శాతం) - 8,301 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - ప్రత్తిపాటి పుల్లారావు - 86,129 (45 శాతం) - ఓటమి 

జనసేన - నాగేశ్వరరావు గాదె ‌- 2,958 (1 శాతం) 

చిలకలూరిపేట ఎన్నికల ఫలితాలు 2014 : 

నియోజకవర్గంలో మొత్తం ఓట్లలో 1,73,730 ఓట్లు పోలయ్యాయి. 

టిడిపి  - ప్రత్తిపాటి పుల్లారావు - 89,591 (51 శాతం) - 10,684 ఓట్ల ఆధిక్యంతో విజయం 

వైసిపి - మర్రి రాజశేఖర్ - 78,907 (45 శాతం) _ ఓటమి 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios