Asianet News TeluguAsianet News Telugu

వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ: ఆరుగురు దుర్మరణం

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో సంభవించిన గ్యాస్ లీకేజీ ప్రమాదానికి ముగ్గురు బలి అయ్యారు. వారిలో ఇద్దరు గ్యాస్ లీకేజీకి కళ్లు కనపించక బావిలో పడి మరణించినట్లు తెలుస్తోంది.

Chemical gas leakage from LG Polymers in Visakhapatnam, Three dead
Author
Visakhapatnam, First Published May 7, 2020, 7:27 AM IST

విశాఖపట్నం: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ లో రసాయన వాయువు లీకేజీ నుంచి తప్పించుకోవడానికి పారిపోతూ ఇద్దరు వ్యక్తులు బావిలో పడి మరణించినట్లు తెలుస్తోంది. కళ్లు కనిపించక వారు బావిలో పడినట్లు సమాచారం. మరో వ్యక్తి కూడా గ్యాస్ లీకేజీకి గురై మరణించినట్లు తెలుస్తోంది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ కారణంగా మొత్తం ఆరుగురు మరణించినట్లు సమాచారం. వృద్ధులు, చిన్నారులు ఎక్కువగా దీనికి గురయ్యారు. వైఎస్ జగన్ సంఘటనా స్థలానికి చేరుకునే అవకాశం ఉంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలో గల ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఆ పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైంది. ఆ విషవాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించింది. బుధవారం ఆర్థరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది.

విషయవాయువుతో చర్మంపై దద్దుర్లు, కళ్ల మంటలో, కడుపులో వికారం పుట్టడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇళ్లు వదిలేసి మేఘాద్రి గెడ్డ వైపు పరుగులు తీశారు. ఐదు గ్రామాల ప్రజలను అధికారులు అధికారులు తరలిస్తున్నారు.

తీవ్ర అస్వస్థకు గురైనవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలిస్తన్నారు. అస్వస్థకు గురైనవారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగరం పోలీసు కమిషనర్ ఆర్ కె మీనా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య సిబ్బంది ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతానికి చేరుకుని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో విషవాయులు లీలకైనట్లు అధికారులు గుర్తించారు. రసాయన వాయువు లీకేజీని అదుపు చేసేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios