ఒంటినిండా బంగారంతో భిక్షాటన.. సిద్ధాంతి వేషంలో మోసం...
దీనిని గమనించిన ఆ వ్యక్తి కారెక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాధాకృష్ణ నిలదీయగా.. అన్నవరం సిద్ధాంతినని 11 ఇళ్లలో బియ్యం సేకరించి షిర్డీ వెళ్లి గోవులకు వండి దాణాగా అందిస్తానని చెప్పాడు. దీంతోపాటు నకిలీ సిద్ధాంతి పొంతలేని సమాధానాలు చెబుతూ ఆగకుండా కారులో ఉడాయించాడు.
ద్వారకా తిరుమల : మండలంలోని వెంకటకృష్ణాపురంలో నకిలీ సిద్ధాంతి గుట్టు రట్టయ్యింది. స్థానికుల కథనం ప్రకారం.. అన్నవరం సిద్ధాంతిని అంటూ ఓ వ్యక్తి వెంకటకృష్ణాపురంలోని చిలుకూరి సునీత ఇంటికి కారులో వచ్చాడు. ముందుగా అతడి సహాయకుడు గేటు తీసి, సిద్ధాంతి వచ్చారని పిలిచాడు. బయటకు వచ్చిన సునీతను బియ్యాన్ని భిక్ష ఇవ్వాలని కోరాడు.
ఆమె rice తీసుకురాగా, చిటికెడు మాత్రమే తీసుకుని తన పాత్రలో వేసుకున్నాడు. ఆ తర్వాత Home architecture బాగుందని, కలబంద, గుమ్మడి కాయలు కట్టాలని సూచించాడు. ఇంతలో అతని మాటల్ని సునీత తన భర్త రాధాకృష్ణకు ఫోన్ స్పీకర్ ద్వారా వినిపించింది. దీనిని గమనించిన ఆ వ్యక్తి కారెక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన రాధాకృష్ణ నిలదీయగా.. అన్నవరం సిద్ధాంతినని 11 ఇళ్లలో బియ్యం సేకరించి షిర్డీ వెళ్లి గోవులకు వండి దాణాగా అందిస్తానని చెప్పాడు. దీంతోపాటు నకిలీ సిద్ధాంతి పొంతలేని సమాధానాలు చెబుతూ ఆగకుండా కారులో ఉడాయించాడు.
పశ్చిమ గోదావరి జిల్లా జల్లేరు వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు: తొమ్మిది మంది మృతి
నకిలీ సిద్ధాంతి కారును రాధాకృష్ణ వెనుక నుంచి ఫొటో తీసి, Social mediaల్లో పెట్టి అందరినీ అప్రమత్తం చేశాడు. ఈనెల 9న తిమ్మాపురంలో ఘంటా చిన్న గాంధి ఇంటికి వెళ్లి అతని కుమారుడికి ప్రాణగండం ఉందని శాంతి జరిపించాలని మభ్యపెట్టాడు. అతని మాటలు నమ్మిన గాంధి రూ. 16,500, కామవరపుకోట మండలంలోని ఆడమెల్లిలో మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి రూ.10వేలు పొగొట్టుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. రాధాకృష్ణ ఇంటి వద్ద ఉన్న CCTV cameraల్లో నకిలీ సిద్ధాంతి వ్యవహారం రికార్డ్ అయ్యింది.
అయితే దీనిమీద ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా ద్వారకా తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై టి. వెంకట సురేష్ కోరారు. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ వ్యక్తి కారులో వచ్చి బిచ్చమెత్తడం.. ఆయన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి బాబాలు చెప్పే మాటలు నమ్మొద్దని, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు మరోసారి హెచ్చరించారు.