Asianet News TeluguAsianet News Telugu

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం: ఇస్రోలో శాస్త్రవేత్తల సంబరాలు

శ్రీహరికోటలోని  సతీష్ ధావన్  అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి  చంద్రయాన్-3   ప్రయోగించారు.  
 

Chandrayaan-3 Launch :Chandrayaan 3 lifts off from Sriharikota lns
Author
First Published Jul 14, 2023, 2:41 PM IST

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి  చంద్రయాన్ -3 ప్రయోగాన్ని శుక్రవారం నాడు చేపట్టారు. శ్రీహరికోట ఇస్రో  ప్రయోగ కేంద్రం నుండి  ఎల్‌వీఎం-3 రాకెట్  ను ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మెన్  సోమనాథ్  ప్రకటించారు.

ప్రయోగ వాహనం నుండి ఉపగ్రహన్ని విజయవంతంగా వేరు చేసినట్టుగా  శాస్త్రవేత్తలు ప్రకటించారు.  ఉపగ్రహం  ఇప్పుడు చంద్రుడిపైకి తన ప్రయాణానికి కావాల్సిన  కక్ష్యలోకి ఇంజెక్ట్ చేయబడిందని ఇస్రో చైర్మెన్ ప్రకటించారు. ఎల్‌వీఎం2 ఎం4 రాకెట్  చంద్రయాన్ 2 ని కచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని  ఇస్రో చీఫ్  సోమ్ నాథ్ చెప్పారు.

విజయవంతంగా నిర్ధేశిత కక్ష్యలోకి చంద్రయాన్-3  ప్రవేశించింది. మూడు దశల్లో  రాకెట్  ప్రయోగం విజయవంతమైందని  ఇస్రో ప్రకటించింది. రాకెట్ నుండి విజయవంతంగా శాటిలైట్ విడిపోయిందని  ఇస్రో తెలిపింది.   భూ కక్ష్యలోకి  చంద్రయాన్ విజయవంతంగా  ప్రవేశించింది.  24  రోజుల పాటు భూ కక్ష్యలో చంద్రయాన్-3 ఉంటుంది.ఆ తర్వాత  చంద్రుడిపై   శాటిలైట్ ల్యాండింగ్ కానుంది. 

జాబిలి దక్షిణ ధృవంలో  ల్యాండ్ అవ్వనున్న ప్రొపల్షన్ మాడ్యూల్. ఈ ఏడాది ఆగష్టు  23 లేదా  24న  చంద్రుడిపై  ప్రొపల్షన్  అడుగు పెట్టనుంది.సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి చంద్రయాన్-3 ప్రయోగించారు.  3.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుడి కక్ష్యలోకి   చంద్రయాన్-3 ప్రవేశించనుంది.చంద్రయాన్-3 ప్రాజెక్టుకు   రూ. 613 కోట్లు వ్యయం చేశారు. చంద్రయాన్-3 బరువు  3, 900  కిలోలు..

లిఫ్ట్-అయిన  పదహారు నిమిషాల తర్వాత  ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్  నుండి విజయవంతంగా  విడిపోయింది.  భూమికి  170 కి.మీ.  దగ్గరగా 36,500  కి.మీ.  దూరంలో కక్ష్యలోకి చంద్రయాన్-  3  సాగనుంది.   దీర్ఘవృత్తాకార చక్రంలో  దాదాపు భూమి చుట్టూ ఐదు లేదా ఆరు సార్లు తిరుగుతూ చంద్రుడి వైపు కదులుతుంది. 

ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన మంత్రి జితేంద్ర సింగ్

ఇస్రో బృందాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అభినందించారు. దేశం గర్వపడేలా చేసిన ఇస్రో టీమ్ కు మంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు. దేశంలోనే శ్రీహరికోట చెప్పుకోదగిన ప్రదేశంగా  మారిందని  మంత్రి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios