నాలుగు కార్పోరేషన్లకు ఛైర్మెన్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈ ఛైర్మెన్ల నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
అమరావతి: నాలుగు కార్పోరేషన్లకు ఛైర్మెన్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. ఈ ఛైర్మెన్ల నియామకానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా మద్దిరాల జోసెఫ్ ఇమ్మాన్యుయేల్, సాహిత్య అకాడమీ ఛైర్మెన్ గా ప్రోఫెసర్ కొలకలూరి ఇనాక్, సంగీత నృత్య అకాడమీ ఛైర్మెన్‌గా వందేమాతరం శ్రీనివాస్, జానపద కళలు, సృజనాత్మకత అకాడమిక్ ఛైర్మెన్‌గా పొట్లూరి హరికృష్ణను నియమించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.
ఈ మేరకు రెండు మూడు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
