అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు లేఖ రాశారు. తన నివాసంలో ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేతకు కేటాయించాలని  ఆయన జగన్‌ను కోరారు.

తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంట్లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ఆ లేఖలో స్పష్టం చేశారు.తన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సందర్శకులను కలుసుకొనేందుకు వీలుగా ప్రజా వేదికను ఉపయోగించుకొంటానని ఆ లేఖలో చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

 

యాజమాన్యం షరతులకు లోబడి ఈ ఇంటిని ఉపయోగించుకొంటున్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కృష్ణా నదికి సమీపంలోని ఉండవల్లిలోని ఇంటిలో నివాసం ఉంటున్నారు. తన నివాసంలో ఉన్న ప్రజావేదికను సందర్శకులను కలుసుకొనేందుకు తనకు కేటాయించాలని బాబు జగన్‌ను కోరారు.