అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీవరకు  విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించారు.  కానీ, అసెంబ్లీ సమావేశాల కారణంగా చంద్రబాబునాయుడు తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకొన్నారు.

ఈ నెల 18వ తేదీతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి.  దీంతో  చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఎన్నికల తర్వాత  కుటుంబసభ్యులతో చంద్రబాబునాయుడు తొలిసారిగా  విదేశీ పర్యటనకు వెళ్లారు.  

యూరప్ పర్యటనకు చంద్రబాబునాయుడు  కుటుంబసభ్యులతో వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు  యూరప్ పర్యటన నుండి స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.