తమ్ముడింటికి చంద్రబాబు.. ఇంత సెడన్ గా ఎందుకంటే

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 1, Sep 2018, 2:33 PM IST
chandrababu visits his own brother house suddenly..why?
Highlights

వారిని ఇంటి బయటే ఉండమని చెప్పి చంద్రబాబు ఒక్కరే లోనికి వెళ్లారు. రామ్మూర్తి , ఆయన కొడుకు సినీ హీరో నారా రోహిత్‌లతో పాటు కుటుంబ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు వారితో గడిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలోని తన తమ్ముడు నారా రామ్మూర్తి నివాసానికి వెళ్లారు. తిరుపతి రూరల్‌ చెర్లోపల్లె సమీపంలోని శ్రీవారి విల్లాస్‌లో నారా రామ్మూర్తి కుటుంబం నివసిస్తోంది. కాగా.. గత కొంతకాలంగా రామ్మూర్తి ఆరోగ్యం సరిగా ఉండటం లేదని సమాచారం. దీంతో.. అక్కడికి వెళ్లిన ఆయన తమ్ముడిని పరామర్శించారు.

యన వెంట మంత్రి నారాయణ, తిరుపతి ఎమ్మెల్యే సుగుణ, కలెక్టర్‌ ప్రద్యుమ్న ఉన్నప్పటికీ వారిని ఇంటి బయటే ఉండమని చెప్పి చంద్రబాబు ఒక్కరే లోనికి వెళ్లారు. రామ్మూర్తి , ఆయన కొడుకు సినీ హీరో నారా రోహిత్‌లతో పాటు కుటుంబ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు దాదాపు 20 నిమిషాల పాటు వారితో గడిపారు. తమ్ముడి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. రామ్మూర్తి కుమారులతో చర్చించినట్టు తెలిసింది. 

ఇంటికి పెద్ద దిక్కుగా తానున్నానని, అధైర్య పడవద్దని మనోధైర్యం అందించినట్టు తెలిసింది. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు విల్లాస్‌లోని తన తమ్ముడి ఇంటి పక్క కాపురం ఉంటున్న స్థానికులతో సరదాగా కాసేపు మాట్లాడారు. వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారితో ఫొటోలు దిగారు. స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి, శాలువలతో సత్కరించారు.

loader