ఢిల్లీ: తమిళనాడు తరహాలో ఏపీలో కుట్ర చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఢిల్లీ, బీహార్, పాండిచ్చేరిలను టార్గెట్ చేసిన కేంద్రం అదే తరహాలో ఏపీని కూడా వేధించడం మెుదలుపెట్టిందని ఆరోపించారు. ఎన్డీఏ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చామో అప్పటి నుంచి టీడీపీపై కేంద్రం వేధింపులకు పాల్పడుతుందని మండిపడ్డారు. 

ఏపీలో అస్థిరతకు కుట్ర పన్నుతుందని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే ఏపీలో ఐటీ దాడులతో వేధింపులకు పాల్పడుతున్నారని చంద్రబాబు గుర్తు చేశారు. తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ పై ఐటీ దాడులు నిర్వహించి భయాందోళనకు గురి చేశారని చెప్పారు.