నెంబర్ వన్ కూలీ నేనే: చంద్రబాబు

https://static.asianetnews.com/images/authors/2e35a18e-a821-5ed4-a5f6-aacc683fc7cc.jpg
First Published 5, Sep 2018, 1:00 PM IST
Chandrababu says he is number one coolie
Highlights

తానే నెంబర్ వన్ కూలీ, తనంతగా కష్టపడే వాళ్లు ఎవరూ లేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి అందాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అందాలు సాటి రావని అన్నారు. 

గుంటూరు: తానే నెంబర్ వన్ కూలీ, తనంతగా కష్టపడే వాళ్లు ఎవరూ లేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి అందాలకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అందాలు సాటి రావని అన్నారు. 

తాను ఈ స్థాయిలో ఉండటానికి గురువులే కారణమని ఆయన అన్నారు గురుపూజోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. 

సిఫార్సులు, రాజకీయాలకు తావులేకుండా చేసిన విద్యాశాఖను ఆయన అభినందించారు. 8వేల మంది రెగ్యులర్‌, 10వేల మంది కాంట్రాక్ట్‌ టీచర్లను భర్తీ చేశామని, అన్ని స్కూళ్లకు సరైన నిధులతో ప్రహరీలు నిర్మించామని తెలిపారు. అన్ని స్కూళ్లకు సొంత భవనాలు ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. 
 
అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ ఉంటే...ఏపీలో ఇన్నోవేషన్‌ వ్యాలీ ఉంటుందని అన్నారు. ఏపీ నాలెడ్జ్‌ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ఎవ్వరూ వినియోగించని టెక్నాలజీని ఏపీ వాడుతోందని చెప్పారు. 

కేంద్రం ఏ విషయంలో కూడా ఏపీకి సహకరించడంలేదని ఆయన విమర్శించారు. నిధులు లేవని ఖాళీగా కూర్చుంటే రాష్ట్రాభివృద్ధి జరగదన్నారు. అప్పులు చేయకపోతే రాజధాని నిర్మాణాన్ని చేపట్టలేమని, అయితే అప్పులు చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారని ఆయన అన్నారు.

loader