ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు తప్పు లేదు: ఏసీబీ కోర్టులో దూబే


ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు తప్పు లేదని  ఏసీబీ కోర్టులో   చంద్రబాబు న్యాయవాది దూబే వాదించారు.

  Chandrababu not signed on Siemens Agreement says lawyer pramod dubey argues in  ACB Court lns

అమరావతి: సీమెన్స్ ఒప్పందంపై చంద్రబాబు సంతకం చేయలేదని చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే ఏసీబీ కోర్టులో వాదించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్,  చంద్రబాబుకు ఐదు రోజుల కస్టడీపై  బుధవారంనాడు ఏసీబీ కోర్టులో  విచారణ జరిగింది. ఇవాళ ఉదయం  ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాకముందే  చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు ప్రారంభించారు.  ఏజీ సుధాకర్ రెడ్డి వచ్చిన తర్వాత వాదనలు ప్రారంభించేందుకు అనుమతివ్వాలని జడ్జిని కోరితే అనుమతి నిరాకరించారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవన్నారు.అప్పటి ఆర్ధికశాఖ ఉన్నతాధికారి సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారని దూబే గుర్తు చేశారు. 

సునీత అధ్యయనం చేసి సీమెన్స్ ప్రాజెక్టుకు అభ్యంతరం తెలపలేదని  ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తెలిపారు.ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమోదం పొందిందన్న ఆధారాలున్నాయని దూబే వాదించారు.  కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్ మెంట్ ధరను నిర్ధారించిన విషయాన్ని దూబే  ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చారు. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీలో చంద్రబాబు లేరని  దూబే వాదించారు.కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం  మధ్యంతర బెయిల్ పై దూబే గుర్తు చేశారు.సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిల్ ను పొడిగించిన విషయాన్ని దూబే ప్రస్తావించారు.

చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే  అరెస్ట్ చేశారన్నారు.చంద్రబాబు అరెస్ట్ తర్వాత విచారణ చేపట్టారని దూబే తెలిపారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేశారన్నారు.ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.... మళ్లీ కస్టడీ అవసరం ఏముందని దూబే సీఐడీని ప్రశ్నించారు. కేబినెట్ ఆమోదం పొందాకే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్నారు.  కేబినెట్నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దూబే వాదించారు.

రోశయ్య విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు దృష్టికి తెచ్చారు దూబే.కేబినెట్ నిర్ణయంపై సీఎంలను తప్పుపట్టడం సరికాదని దూబే వ్యాఖ్యానించారు.  ఈ విషయమై  వివిధ కోర్టుల తీర్పులను ఉదహరించిన న్యాయవాది దూబే ప్రస్తావించారు. కొన్ని ఫైళ్లు మిస్ చేశారంటూ సీఐడీ అభియోగాలు మోపిందన్నారు. 

 ఈ కేసుతో సంబంధం ఉన్న పెండ్యాల శ్రీనివాస్, వాసుదేవ్ అంశాన్ని న్యాయవాది దూబే ప్రస్తావించారు. శ్రీనివాస్, వాసుదేవ్ నోటీసులు అందుకున్నారన్నారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన విదేశాలకు వెళ్తే బాబుకు సంబంధం ఏమిటీ.. వాళ్లు విదేశాలకు వెళ్తే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పడం సబబా అని  దూబే ప్రశ్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios