Asianet News TeluguAsianet News Telugu

అధికారం ఉందని విర్రవీగితే తీవ్రపరిణామాలు:కేంద్రానికి చంద్రబాబు వార్నింగ్

కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీటీ ప్రాజెక్ట్‌, గుమ్మఘట్ట, కలుగోడు, రంగచేడు గ్రామాల రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
 

Chandrababu naidu warns to central government
Author
Ananthapuram, First Published Oct 10, 2018, 3:36 PM IST

అనంతపురం: కేంద్రప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలో పర్యటించిన చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీటీ ప్రాజెక్ట్‌, గుమ్మఘట్ట, కలుగోడు, రంగచేడు గ్రామాల రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకువచ్చేందదుకు తాము ప్రయత్నిస్తుంటే కేంద్రప్రభుత్వం పునర్విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.  

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీసేందుకే తాము ఎన్డీయే నుంచి వైదొలిగామని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే నుంచి వైదొలిగినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్రం చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాల్లో అభివృద్ధి నిమిత్తం విడుదల చేసిన నిధులను సైతం కేంద్రం వెనక్కి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు ప్రతిపక్ష పార్టీ నేతలు కేసుల నుంచి ఎలా బయటపడాలన్న ధ్యాసే తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధ లేదన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వారి కాళ్లు పట్టుకోవడం ప్రతిపక్ష పార్టీకి అలావాటుగా మారిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని, కేంద్రాన్ని విమర్శించకుండా తమను తిట్టడమే పనిగగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

మోదీ పేరెత్తితే వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని చంద్రబాబు విమర్శించారు. ఉప ఎన్నికలు రాకుండా చూసుకునే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు మూడు పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడమే అలవాటుగా మారిందన్నారు. 

అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్‌ ప్రస్తుతం మోదీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. 

జనసేన ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ వేసిన పవన్‌ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని తేల్చారని ఆ నివేదికపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాజకీయాల్లో విలువలు, పద్ధతి ఉండాలని సూచించారు. అధికారం ఉంది కదా అని తప్పుడు పనులు చేయడం సరికాదని హితవు పలికారు. 

అటు టీఆర్ఎస్ పార్టీపైనా చంద్రబాబు విసుర్లు విసిరారు.  ఎన్డీయే నుంచి వైదొలగక ముందు ఏపీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికేదని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని టీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేశారని చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

మోదీ కంటే తానే సీనియర్‌ రాజకీయ నేతని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అలాంటి తనను పట్టుకుని మెచ్యురిటీ లేదని పార్లమెంటులో మాట్లాడటం ఏంటని? ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ...ఎన్టీఆర్‌ హయాంలో టీడీపీ 35 సీట్ల మద్దతుతో కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని గుర్తు చేశారు. 

ప్రపంచంలో తెలుగుజాతి ఎక్కడున్నా టీడీపీ ఆదుకుంటుందని స్పస్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మహాకూటమిలో చేరితే అందుకు తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios