సీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిఫ్ట్‌లు  ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 

గుంటూరు: కేసీఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిఫ్ట్‌లు ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. నాకేదో గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని... ఈ బెదిరింపులకు తాను భయపడనని బాబు మరోసారి స్పష్టం చేశారు.

శుక్రవారం నాడు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు స్పందించారు.కేసీఆర్‌కు అవినీతి తమ్ముడు... జగన్ తోడయ్యాడని బాబు ఎద్దేవా చేశారు. కేసీఆర్‌, జగన్‌లు కలిసినా ఏపీని ఏమీ చేయలేరని బాబు ధీమాను వ్యక్తం చేశారు.

కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈడీతో దాడులు చేయిస్తారా అని బాబు ప్రశ్నించారు.ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదని బాబు హెచ్చరించారు.