ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమవారం జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ చంద్రబాబు నాయుడు.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. సోమవారం జరిగిన టీడీపీ స్ట్రాటజీ కమిటీ చంద్రబాబు నాయుడు.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందన్నారు. ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందన్నారు. వివేకా హత్య కేసులో జగన్ పూర్తిగా కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు.
వివేకా హత్యను తనపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయ్ హత్య ఘటనతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తే... ఏమవుతుంది? అది 12వ కేసు అవుతుందని జగన్ వ్యాఖ్యానించడమంటే అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
సీఎం జగన్ వివేకా హత్యను వాడుకున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ ఇప్పుడు బయటకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూత్రధారి ఎవరన్నది తేలిపోయిందని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఆనాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.... ఇప్పుడు సీబీఐ విచారణను తప్పు పట్టడం వరకు హత్య కేసులో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. ప్రతి సమస్యకు, ప్రతి ప్రశ్నకు డైవర్ట్ పాలిటిక్స్ అమలు చేస్తున్న జగన్.. వివేకా హత్య కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడం అసాధ్యమన్నారు. హత్యను పాత్రధారులకే పరిమితం చేయకూడదని.. హత్యకు గల సూత్రధారులను బోనులో నిలబెట్టాలన్నారు.
వివేకా హత్య కేసు సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే రాష్ట్రంలో ఏ పౌరుడి ప్రాణాలకైనా రక్షణ ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్ కోటలోనే వైఎస్ తమ్ముణ్ని హత్యచేయడం అంత:పుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా అని ప్రశ్నించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్ధుల బాధలు కలిచి వేస్తున్నాయని చంద్రబాబు అన్నారు. రష్యా -ఉక్రెయిన్ యుద్ధం పేరుతో అప్పుడే వంటింటి నూనె రేట్లు పెంచేశారని చంద్రబాబు తెలిపారు. రానున్న రోజుల్లో నూనె రేట్లు మరింత భారం కాకుండా ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు.
