Asianet News TeluguAsianet News Telugu

పంచాయితీ ఎన్నికలకు సిద్ధమే కానీ..:చంద్రబాబు

పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న చంద్రబాబు రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని అందువల్లే ఆలస్యం అవుతుందని తెలిపారు. రిజర్వేషన్ల అంశం తేలగానే ఎన్నికలకు వెళ్లేందుక సిద్ధమని బాబు స్పష్టం చేశారు.

chandrababu naidu says we are ready to conduct local body elections
Author
Visakhapatnam, First Published Oct 23, 2018, 6:45 PM IST

విశాఖపట్నం: పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. విశాఖపట్నంలో పర్యటిస్తున్న చంద్రబాబు రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని అందువల్లే ఆలస్యం అవుతుందని తెలిపారు. రిజర్వేషన్ల అంశం తేలగానే ఎన్నికలకు వెళ్లేందుక సిద్ధమని బాబు స్పష్టం చేశారు.
  
3నెలల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రత్యేక అధికారుల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. స్పెషల్‌ ఆఫీసర్ల పాలనను కొనసాగిస్తూ జారీ చేసిన జీవో నెం.90ను హైకోర్టు కొట్టేసింది. 

మరోవైపు పంచాయితీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి కాల్వ శ్రీనివాస్ తెలిపారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉందని అలాగే కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందలు ఉన్నాయన్నారు. అందువల్లే ఆలస్యం అవుతుందన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చెయ్యడమే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.    

Follow Us:
Download App:
  • android
  • ios