Chandrababu's arrest: పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారిన టీడీపీ శ్రేణుల నిరసనలు
Vijayawada: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నేతల బృందం సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ ను టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలు, టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల పోలీసుల అత్యుత్సాహంపై ప్రతిపక్షాలు ఆయనకు ఫిర్యాదు చేశాయి.
Chandrababu Naidu Arrest: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టులతో ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోమవారం రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. నిరసనల నేపథ్యంలో పలు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనలు, రాష్ట్ర బంద్ పాటిస్తుండటంతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారాయి. టైర్లు దగ్ధం చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పలువురు టీడీపీ కార్యకర్తలు రోడ్ల మధ్యలో బైఠాయించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ప్రభుత్వ బస్సులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. శాంతిభద్రతలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ సహా పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు అరెస్టు, జ్యుడీషియల్ కస్టడీని నిరసిస్తూ తిరుపతి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి. అవినీతి కేసులో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) శనివారం అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఆయనకు ఈ నెల 23 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి మొత్తం రూ.3300 కోట్ల ప్రాజెక్టు విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అయితే, అధికార పార్టీ కావాలనే చంద్రబాబును ఇరికిస్తున్నదనీ, అక్రమంగా అరెస్టు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అని పేర్కొన్నారు. ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించకుండానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుపై తెలుగుదేశం పార్టీ నేతల బృందం సోమవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ ను టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కే.అచ్చెన్నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసింది. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలు, టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల పోలీసుల అత్యుత్సాహంపై ప్రతిపక్షాలు ఆయనకు ఫిర్యాదు చేశాయి.