ఢిల్లీ: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటనలో బీజేపీ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు నాయుడు అసహసం వ్యక్తం చేశారు. తమను నిందించడం సరికాదని హితవు పలికారు.  శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్నకత్తితో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి చేశారని నిందితుడిని సీఎస్ఐఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 11 పేజీల లేఖతోపాటు మరో కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 

ప్రతిపక్ష నేత ఘటనపై గంట వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం స్పందించిందని మండిపడ్డారు. స్పందిస్తే మంచిదే కానీ తెలుగుదేశం పార్టీని నిందించడం నిందించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. 

గవర్నర్ నరసింహన్ ఘటనకు సంబంధించి డీజీపీకి ఫోన్ చెయ్యడం ఎంటని చంద్రబాబు నిలదీశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావులాంటి వ్యక్తులు కోరడం చూస్తుంటే కుట్ర అర్ధమవుతుందన్నారు. 

ఇకపోతే జగన్ పై దాడి ఆపరేషన్ గరుడలో భాగంగానే జరిగిందని నమ్మాల్సి వస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సినీనటుడు శివాజీ చెప్పినట్లే జరిగిందని తెలిపారు. ఈ అంశాన్ని కూడా బీజేపీ తమనే టార్గెట్ చేస్తుందని తమను వేధిస్తోందని మండిపడ్డారు. బీజేపీ టీడీపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు.