పశ్చిమబెంగాల్‌లో కేంద్రచర్యను జగన్, కేసీఆర్ తప్ప అందరూ ఖండించారన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
పశ్చిమబెంగాల్‌లో కేంద్రచర్యను జగన్, కేసీఆర్ తప్ప అందరూ ఖండించారన్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019పై ఆయన పార్టీ నేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఫెడరల్ ఫ్రంట్ అని తిరిగిన కేసీఆర్.. బెంగాల్ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే.. జగన్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
జగన్‌కు ఉన్న కులపిచ్చి గురించి అందరికీ తెలుసన్నారు. అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నమని సీఎం తెలిపారు. కేంద్రంపై మమతా బెనర్జీ పోరాటానికి మద్ధతు తెలిపిన చంద్రబాబు.. ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి మమత దీక్షకు సంఘీభావాన్ని ప్రకటించనున్నారు.