గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. పోలీసులపై చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు అరండల్ పేట పోలీసులు. 

వివరాల్లోకి వెళ్తే పోలీసులపై చంద్రాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మస్తఫా, ఉండవల్లి శ్రీదేవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

గత కొంతకాలంగా పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి అనుకూలంగా కొందరు పోలీసులు పనిచేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 

సీఎం జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత వర్లరామయ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.