ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా.. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ‘‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు గీతం ఆస్కార్ అందుకోవటం అభినందనీయం. చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకోవడం ద్వారా ‘నాటు నాటు’ చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది బహుశా భారతీయ సినిమాకి అత్యుత్తమ ఘట్టం. తెలుగువారు దీనిని సాధించడం మరింత ప్రత్యేకం’’ అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాజమౌళి, కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌తో పాటు మిగిలిన వారికి అభినందనలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు.
వీడియో
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌కు అభినందనలు. ఆస్కార్ ద్వారా మీరు భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమను గర్వించేలా చేసారు’’ అని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.
ఇక, నాటు నాటు సాంగ్ మొదట లిరికల్ వీడియో విడుదలైనప్పటి నుంచి సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. జపాన్, చైనా, అమెరికా , ఇంగ్లాండ్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు సైతం ఫిదా అవుతూ ఈ పాటకి మ్యూజిక్ రీల్స్ చేశారు. ఈ పాట ఆస్కార్ అవార్డు సాధించింది అంటే రాజమౌళి, కీరవాణి తో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, లిరిక్స్ అందించిన చంద్రబోస్, గాత్రం అందించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గురించి కూడా చెప్పాలి.
ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అందించిన హుక్ స్టెప్ ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడానికి కారణం అని చెప్పాలి. ఇక రాంచరణ్, ఎన్టీఆర్ ని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇద్దరూ తమ డ్యాన్స్ మూమెంట్స్ లో చిన్న తేడా కూడా లేకుండా పర్ఫెక్ట్ సింక్ తో డ్యాన్స్ చేశారు. ఆర్ఆర్ ఆర్ చిత్రానికి అంతర్జాతీయంగా వస్తున్న రెస్పాన్స్ గమనించిన జక్కన్న రాజమౌళి.. ఈ చిత్రానికి ఆస్కార్ సాధించే సత్తా ఉందని గట్టిగా నమ్మారు. ఇండియా తరఫున ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్స్ కి షార్ట్ లిస్ట్ కాలేదు. అయినా రాజమౌళి నిరాశ పడలేదు. తనవంతు ప్రయత్నాలు గట్టిగా చేశారు. ఫలితంగా నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపిక కావడం మాత్రమే కాదు.. అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవల ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను లైవ్‌లో పాడారు.
