Asianet News TeluguAsianet News Telugu

'ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు': టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ పై  చంద్రబాబు ఆగ్రహం

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల గెలుపొందిన టీడీపీ అభ్యర్థి రామ్ గోపాల్ రెడ్డి కి డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో టీడీపీ నేతలు ఆందోళనల చేశారు. ఈ క్రమంలో భాగంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో వారందరిని అర్ధరాత్రి 2 గంటలకు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం చేశారు.

Chandrababu is angry over the arrest of TDP candidate Ram Gopal Reddy
Author
First Published Mar 19, 2023, 9:36 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ఎవ్వరూ ఊహించని విధంగా మూడు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీడీపీ విజయం సాధించింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపొందింది.టీడీపీ గెలిచిన మూడు స్థానాల్లో ఒకటి ఉత్తరాంధ్ర కాగా, మరో రెండు రాయలసీమ స్థానాలు. ప్రధానంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల ఫలితం తుది వరకు ఉత్కంఠ కొనసాగింది. రెండో ప్రాధాన్యత ఓట్లతో చివరకు టీడీపీ అభ్యర్ది భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. 

డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా  .. 

టీడీపీ అభ్యర్ది భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించిన అతనికి డిక్లరేషన్ ఫారం ఇవ్వకుండా కాలయాపన చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు  కౌంటింగ్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్ళిపోతుండడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో  టీడీపీ నేతలు జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో భాగంగా కలెక్టర్,జాయింట్ కలెక్టర్ వాహనాలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని ఈడ్చుకువెళ్లారు. జేఎన్టీయూ కాలేజ్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఆందోళనలో మాజీ మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బి.కె. పార్థసారథి, శ్రీనివాస్ రెడ్డి, పరిటాల శ్రీరామ్, ప్రభాకర్ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర నాయుడు, శ్రీధర్ చౌదరి, ఆలం నరసానాయుడు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

వారిని కూడా అరెస్ట్ చేసి.. అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ప్రజాస్వామ్య బద్ధంగా డిక్లరేషన్ ఇవ్వకుండా.. అధికారులు వ్యవహరిస్తున్నారనీ, తమ బాధను నిరసన ద్వారా వ్యక్తపరిచామని చెప్పారు. ఆయన తీరుపై నిరసన చేస్తే, అరెస్ట్ చేసి అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీస్ అరెస్టు చేశారని వాపోయారు.

సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

ఈ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్ర బాబు అసహనాన్ని వ్యక్తం చేశారు.  చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తన నిరసనను వ్యక్తం చేస్తూ.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.  ఏం బతుకయ్యా జగన్ రెడ్డీ..ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా ఒత్తిడి చేసి అడ్డుపడతావా? పులివెందుల టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలిచాడని అక్కసుతో అర్థరాత్రి అరెస్టు చేస్తావా? అంటూ నిలాదీశారు. మరో ట్విట్ లో.. ఇంతకంటే నువ్వు ఇంకేం బ్రష్టుపట్టిపోవాల్సింది ఉంది? ప్రజా తీర్పును గౌరవించి క్షమాపణ కోరు..అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios