నెగ్గిన చంద్రబాబు శపథం... సీఎంగానే అసెంబ్లీకి..!
అంతేకాదు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారు. అయితే.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఓ శపథం చేశారు.
నారా చంద్రబాబు నాయుడు కి పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఆయనది. అలాంటి ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో గెలుపు, ఓటములు రెండింటినీ చూశారు. కానీ.. గత ప్రభుత్వం మాత్రం ఆయనను చాలా ఇబ్బంది పెట్టింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇబ్బంది పెట్టినవారే.
అసెంబ్లీలో ఆయన భార్య ప్రస్తావన తీసుకువచ్చి కూడా చాలా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడూ నిబ్బరంగా ఉండే వ్యక్తి.. వాళ్ల మాటలకు చాలా బాధపడ్డారు. ఏకంగా మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారు. అయితే.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఓ శపథం చేశారు.
మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడితే.. ముఖ్యమంత్రిగా మాత్రమే అడుగుపెడపతాను అంటూ శపథం చేశారు. కాగా.. ఆయన శపథం చేసినట్లుగానే... అనుకున్నది సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలో టీడీపీ విజయ ఢంకా మోగించింది. తమ కూటమికి చెందిన జనసేన, బీజేపీతో కలిసి విజయ ఢంకా మోగించింది. అలాంటి ఇలాంటి విజయం కాదు.. మ్యాజిక్ ఫిగర్ తాటేసింది. నిన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం దారుణంగా కుప్పకూలిపోయింది. కనీసం రెండు అంకెల సీట్లు కూడా రాకుండా చేసింది. కాగా.. నాడు చంద్రబాబు శపథం చేసిన వీడియోని ప్రస్తుతం.. టీడీపీ నేతలు నెట్టింట వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు అనున్నది సాధించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం టీడీపీ నేతల హంగామా మామూలుగా లేదు.