విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. "మోడీకి భార్య ఉందనే విషయం మీకు తెలుసా? ఆమె పేరు జశోదా బెన్, ఆయన భార్యనూ కుటుంబాన్నీ వదిలేశాడు" అని ఆయన వ్యాఖ్యానించారు. 

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ తనపై చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోడీ భార్యను ప్రస్తావించి తిప్పికొట్టారు. లోకేష్ తండ్రి, ఎపి ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబుపై నరేంద్ర మోడీ తన గుంటూరు సభలో వ్యాఖ్యలు చేశారు. దాన్ని తిప్పికొట్టడానికి మోడీ భార్యను చంద్రబాబు ఎత్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయవాడలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. "మోడీకి భార్య ఉందనే విషయం మీకు తెలుసా? ఆమె పేరు జశోదా బెన్, ఆయన భార్యనూ కుటుంబాన్నీ వదిలేశాడు" అని ఆయన వ్యాఖ్యానించారు. తనను లోకేష్ తండ్రిగా వ్యాఖ్యానించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను లోకేష్ తండ్రిని అయినందుకు గర్విస్తున్నానని అన్నారు. 

నరేంద్ర మోడీకి మానవత్వం, కుటుంబ సంబంధాల గురించి తెలియదని, మోడీకి కుమారుడు లేడని, భార్యకూ కుటుంబానికీ మోడీ దూరమయ్యారని ఆయన అన్నారు. తాను వ్యక్తిగత విమర్శలకు వ్యతిరేకమని, అయితే, మోడీ తన కుటుంబాన్ని ప్రస్తావించారు కాబట్టి అదే తరహాలో తాను తిప్పికొట్టక తప్పదని చంద్రబాబు అన్నారు. 

తనను విమర్శించడానికే ఢిల్లీ నుంచి మోడీ ప్రత్యేక విమానంలో వచ్చారని ఆయన అన్నారు. తాను ఎన్టీఆర్ కు వెన్నుపొడిచినట్లు మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు తన గురువును ఎల్కే అద్వానీని వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోడీదని ఆయన వ్యాఖ్యానించారు. 

గోద్రా ఊచకోత తర్వాత అప్పటి ప్రధాని వాజ్ పేయి మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలగించాలని అనుకున్నారని, కానీ మోడీని గురువు అద్వానీ కాపాడారని ఆయన అన్నారు. ఆ విషయాన్ని మోడీ మరిపోయారని, అద్వానీ అభివాదం చేస్తే ప్రతిగా అభివాదం చేయని చరిత్ర మోడీదని ఆయన అన్నారు. 

తాను ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన అన్నారు. చాయ్ వాలాను అని చెప్పుకుంటూనే మోడీ ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరిస్తారని ఆయన అన్నారు.