15 లక్షల ఓట్ల గోల్ మాల్ పై హైలెవల్ కమిటీకి డిమాండ్: సీఈసీతో భేటీ తర్వాత బాబు

 ఏపీ రాష్ట్రంలో ఓటర్ల నమోదులో చోటు చేసుకున్న  అవకతవకలపై  సీఈసీకి  ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టుగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చెప్పారు.
 

Chandrababu Demands High level Committee For Bogus Voters in Andhra Pradesh lns

న్యూఢిల్లీ: రాష్ట్రంలో  15 లక్షల ఓట్లలో అవకతవకలు జరిగాయని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు  ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ ఓట్ల విషయమై  సీఈసీతో  టీడీపీ చీఫ్  చంద్రబాబు  సోమవారంనాడు భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత  ఆయన  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓట్ల నమోదులో చోటు చేసుకున్న అవకతవకలపై  హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని  ఆయన ఈసీని కోరారు.ఇతర రాష్ట్రాలకు  చెందిన ఐఎఎస్ లను పంపి  ఓటర్ల నమోదులో అవకతవకలను  సరి చేయాలని ఆయన ఈసీని కోరారు.

ఓట్ల తొలగింపుపై కోర్టుకు కూడ వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరించి, భయపెట్టి తమ పార్టీ అభ్యర్థులను  ఉపసంహరింపచేశారని  చంద్రబాబునాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చిందన్నారు.ఒక పార్టీ ఓట్లు  తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదన్నారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను ప్రింట్ చేశారని  చంద్రబాబు ఆరోపించారు.  మీడియా సమావేశంలో  నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను  ఆయన  మీడియా ప్రతినిధులకు చూపారు.ఈ విషయమై  చర్యలు తీసుకోవాలని  ఈసీ ఆదేశాలు  జారీ చేసినా పట్టించుకోలేదని  చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ డిగ్రీ  ధృవపత్రాలతో  ఓట్లు నమోదు చేయించారని వైఎస్ఆర్‌సీపీపై  చంద్రబాబు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని  ఆయన మండిపడ్డారు. తమ పార్టీ హయంలో  ఎప్పుడూ  ఇలాంటి చెత్త పనులు చేయలేదని  చంద్రబాబు చెప్పారు.ఓట్ల అక్రమాలపై  ప్రశ్నించే వారిని కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు  ఈసీకి వివరించినట్టుగా  చంద్రబాబు తెలిపారు.

వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.  బీఎల్ఓలు  ఎలాంటి విచారణ చేయకుండానే  ఓట్లను తొలగిస్తున్నారన్నారు. కనిగిరి నియోజకవర్గంలో  జీరో డోర్ నెంబర్ పేరుతో ఓట్లను నమోదు చేశారని చంద్రబాబు చెప్పారు.దొంగ ఓట్లకు సంబంధించిన సమాచారాన్ని  ఈసీకి ఆధారాలతో అందించినట్టుగా చంద్రబాబు  తెలిపారు.

ఓటర్ల వ్యక్తిగత డేటాను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.ఓటర్ల వ్యక్తిగత డేటా  వాలంటీర్లకు ఎందుకు  అని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగ ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే  ఫలితాలు కూడ అదే విధంగా ఉంటాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.   అక్రమాలకు పాల్పడిన అధికారులకు జైలుకు పంపే అధికారం ఈసీకి ఉందన్నారు చంద్రబాబు.ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం కూడ  ఈసీకి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఓటర్ల నమోదులో  ఏపీలో జరుగుతున్న అక్రమాలు దేశంలో ఎక్కడా లేవని  చంద్రబాబు చెప్పారు.ఎన్నికల కమిషన్ అధికారులు వచ్చి రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలను పరిశీలించాలని ఆయన  కోరారు.

also read:సీఈసీతో బాబు భేటీ: ఏపీలో దొంగ ఓట్లపై ఫిర్యాదు

ఈ విషయమై  ఓ కమిటీని ఏర్పాటు చేసి  ఓటర్ల నమోదుపై అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఆయన  కోరారు. రాష్ట్రంలో ఓట్ల  అక్రమాలను సరిదిద్దాలని చంద్రబాబు ఈసీని కోరారు.గతంలో  అక్రమాలు జరిగితే ఇవాళే వచ్చి ఎందుకు  ఫిర్యాదు చేస్తున్నారని  వైసీపీని ఉద్దేశించి  చంద్రబాబు వ్యాఖ్యానించారు. అప్పుడు ఏం చేశారని ఆయన అడిగారు. ఎన్నికలకు ముందే ఓటరు నమోదులో  అక్రమాలను సరి చేయాలని  చంద్రబాబు ఈసీని కోరారు.ఓటర్ల నమోదుకు సంబంధించి తాము ఇచ్చిన వివరాలు వాస్తవమో, వైసీపీ ఇచ్చిన వివరాలు  వాస్తవమో తేల్చాలని ఆయన ఈసీని కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios