అనంతపురం: తాడిపత్రి మండలం భోగ సముద్రంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో గ్యాస్ సిలిండర్ పేలి  ఇంజనీర్ మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సిమెంట్ ఫ్యాక్టరీలో  గ్యాస్ లీకై సిలిండర్ పేలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గ్యాస్ లీకైన విషయాన్ని గుర్తించకపోవడంతో సిలిండర్ పేలిందని వారు చెప్పారు.

ఈ పేలుడుతో ఇంజనీర్ చక్రవర్తి మరణించారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని సహచర కార్మికులు వెంటనే  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

సిలిండర్ నుండి గ్యాస్ లీకు కావడానికి గల కారణాలపై కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. గ్యాస్ ఎలా లీకైంది, సిలిండర్ పాడైందా.. ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. 

ఫ్యాక్టరీలో పేలుడు సంబవించడంతో  అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. సిలిండర్ పేలిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.