ప్రకాశం జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యారు. వారు చేసిన పనికి ఆగ్రహం చెందిన విద్యార్థినులు నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే చీరాల లోని మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు వాష్‌ రూమ్‌కు వెళ్లారు. 

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అడ్డంగా బుక్కయ్యారు. వారు చేసిన పనికి ఆగ్రహం చెందిన విద్యార్థినులు నాలుగు తగిలించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే చీరాల లోని మహిళా డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థినులు వాష్‌ రూమ్‌కు వెళ్లారు. 

అప్పటికే అక్కడకు చేరుకున్న ఆకతాయిలు గోడపై కూర్చుని సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఆకతాయిలను చూసిన విద్యార్థినులు పెద్దగా కేకలు వేయ్యడంతో పరారయ్యేందుకు ప్రయత్నించారు.

పారిపోతుండగా స్థానికులు ఒకరిని పట్టుకుని కళాశాల అధ్యాపకులకు అప్పగించారు. ఆకతాయిని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు కళాశాల యాజమాన్యం, స్థానికులు. పట్టుబడ్డ నిందితుడు ఒంగోలుకు చెందిన పాలపర్తి కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు. 

అయితే తన బాబాయిని చూసేందుకు చీరాల వచ్చానని కార్తీక్ చెప్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అతడి దగ్గర ఎలాంటి సెల్ ఫోన్ లేదని స్పష్టం చేశారు. పరారైన యువకుడి వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.