ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని అంబికా కృష్ణ నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం నాడు సోదాలు నిర్వహించారు.

అంబికా సంస్థలకు వేర్వేరు పేర్లతో లోన్లు తీసుకొన్నారనే విషయమై సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం.  అంబికా కృష్ణ  కుటుంబసభ్యుల ఇళ్లలో కూడ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.2019 ఎన్నికల తర్వాత అంబికా కృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు.