Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్: టెక్నికల్ కారణాలతో చార్జీషీట్ వెనక్కి, మళ్లీ దాఖలు చేసిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో  సీబీఐకి కోర్టు షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో చార్జీషీట్ ను  కోర్టు వెనక్కి పంపింది.  టెక్నికల్ కారణాలను  సవరించి  చార్జీషీట్ ను మళ్లీ దాఖలు  చేసింది సీబీఐ.

CBI Re Submits Chargesheet on YS Vivekananda Reddy Murder Case lns
Author
First Published Jul 11, 2023, 12:16 PM IST

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో  బిగ్ ట్విస్ట్ చోటు  చేసుకుంది.  సీబీఐ దాఖలు  చేసిన  చార్జీషీట్ ను కోర్టు వెనక్కు పంపింది.  టెక్నికల్  కారణాలతో  చార్జీషీట్ ను వెనక్కు పంపింది. అయితే  చార్జీషీట్ లో  తప్పిదాలను  సవరించి  కోర్టుకు సమర్పించింది  సీబీఐ.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  ఈ ఏడాది జూన్  30వ తేదీన   సప్లిమెంటరీ చార్జీషీట్ ను  సీబీఐ కోర్టులో దాఖలు  చేసింది.   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  ఎనిమిదో నిందితుడిగా  చార్జీషీట్ లో  సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.   సీబీఐ ఇటీవల దాఖలు  చేసిన సప్లిమెంటరీ చార్జీషీట్ లో  టెక్నికల్ కారణాలతో వెనక్కి పంపింది  సీబీఐ.  సవరించిన  చార్జీషీట్ ను కోర్టుకు సమర్పించింది  సీబీఐ.

2019 మార్చి  14న  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.ఈ హత్య కేసును సీబీఐ విచారిస్తుంది.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును  తొలుత సిట్ విచారించింది.  తొలుత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో సిట్  విచారించింది.  ఆ తర్వాత వైఎస్ జగన్  సర్కార్ కూడ సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే  సీబీఐతో విచారణ చేయించాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు  పిటిషన్లు దాఖలు  చేశారు. ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన  ఏపీ హైకోర్టు  సీబీఐ విచారణకు  ఆదేశాలు జారీ చేసింది. 


  

 

Follow Us:
Download App:
  • android
  • ios