కర్నూలు: కర్నూలు జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. నంద్యాల జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ ఎస్పీ వై రెడ్డి నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో ఎస్పీవై రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 

కర్నూలు, నంద్యాల, హైదరాబాద్ లలోని నివాసాలు, కార్యాలయాలలో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఎస్పీ వైరెడ్డి పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. 

ఇకపోతే ఇటీవలే అనారోగ్యం పాలైన ఎస్పీ వైరెడ్డి ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సీబీఐ సోదాలు నిర్వహించడం గమనార్హం. ప్రస్తుతం సోదాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఆదివారం ఉదయం తెలిసే అవకాశం ఉంది.