Asianet News TeluguAsianet News Telugu

రూ.228 కోట్ల రుణం ఎగవేత.. ఏపీలో సీబీఐ సోదాలు, ప్రకాశం సంస్థపై కేసు

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన తేర్‌షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ (cbi raids) కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ కేసు పెట్టింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ సంస్థ రూ.228 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా తెలుస్తోంది.

cbi raids in andhra pradesh
Author
Ongole, First Published Jan 6, 2022, 3:52 PM IST

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన తేర్‌షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ (cbi raids) కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ కేసు పెట్టింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ సంస్థ రూ.228 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఛైర్మన్ బెల్లం కోటయ్య, జయంత్ బాబులతో పాటు బీకే ఎక్స్‌పోర్ట్, మహి అగ్రో కంపెనీ, విజయ ఏరో బ్లాక్స్ లోనూ సోదాలు చేసింది. మొత్తం పది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నర్రా ప్రసన్న కుమార్‌తో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిపింది సీబీఐ. 

Follow Us:
Download App:
  • android
  • ios