Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సీబీఐ కేసు: ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు


 మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐ నుండి తీసుకొన్న రుణం ఎగ్గొట్టిన కేసులో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది.సోమవారం నాడు వెంకట్రావు ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

CBI files case against Tadishetty Venkatrao lns
Author
Guntur, First Published Jul 26, 2021, 6:34 PM IST

గుంటూరు: మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంకట్రావు ఆస్తులపై సోమవారం నాడు సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.పొగాకు కొనుగోలు కంపెనీ పేరిట ఎస్బీఐ నుండి వెంకట్రావు రూ. 45 కోట్ల రుణం తీసుకొన్నాడు.  ఈ రుణంలో ఇంకా రూ. 19 కోట్లు బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది.ఈ రుణం చెల్లించకపోవడంతో వెంకట్రావుపై ఎస్బీఐ అధికారులు పిర్యాదు చేశారు.దీంతో సీబీఐ కేసు నమోదు చేసింది. 

బ్యాంకుకు చెల్లించాల్సిన రుణాలు చెల్లించకుండా ఉన్న వెంకట్రావు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే విషయమై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట్రావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.వెంకట్రావు 2019 మార్చి మాసంలో  కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో గుంటూరు సిటీ నుండి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios