హైదరాబాద్: వోక్స్ వ్యాగన్ కేసులో ఏపీ మంత్రి బొత్ససత్యనారాయణకు  హైద్రాబాద్ సీబీఐ కోర్టు సమన్లు   జారీ చేసింది. వచ్చే నెల 12 వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.

ఉమ్మడి ఏపీ  రాష్ట్రంలో  మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ కేసు చోటు చేసుకొంది.వోక్స్ వ్యాగన్ కేసులో  సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  వోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది. 2005లో  కేసు నమోదైంది.

వోక్స్ వ్యాగన్ కేసులో అవినీతి చోటు చేసుకొందని ఆనాడు ఆరోపణలు రావడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగించింది.ఆ సమయంలో బొత్స సత్యనారాయణ ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు.

వోక్స్ వ్యాగన్ కేసులో సుమారు రూ. 12 కోట్ల రూపాయాల అవినీతి చోటు చేసుకొందని సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు రూ. 7 కోట్లను రికవరీ చేశారు. మరో రూ. ఐదు కోట్లను రికవరీ చేయాల్సి ఉంది.

ఈ కేసులో ఇప్పటికే మూడువేల పేజీల చార్జీషీటును సీబీఐ దాఖలు చేసింది. 59 సాక్షులను విచారించింది. ఓ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న జైన్ అక్రమాలకు పాల్పడినట్టుగా సీబీఐ అనుమానిస్తోంది.

ఈ కేసులో ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నందున ఈ కేసు విషయమై హాజరుకావాలని సీబీఐ కోర్టు శుక్రవారం నాడు ప్రస్తుత ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణకు సమన్లు పంపింది.వచ్చే నెల 12వ తేదీన ఈ కేసు విషయమై బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.