Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ టెస్ట్: అనుమతిచ్చిన కోర్టు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  రాసిన లేఖపై  నిన్ హైడ్రిన్  పరీక్షకు   కోర్టు అనుమతిని ఇచ్చింది.  

CBI Court  Green Signals  To ninhydrin test  of  YS Vivekananda Reddy  Letter  lns
Author
First Published Jun 7, 2023, 4:22 PM IST


హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్  వివేకానందరెడ్డి  రాసిన లేఖపై నిన్ హైడ్రిన్  పరీక్షకు కోర్టు  బుధవారంనాడు అనుమతిని  ఇచ్చింది.హత్యకు గురయ్యే ముందు  వైఎస్ వివేకానందరెడ్డి  రాసినట్టుగా చెబుతున్న లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు గాను  నిన్ హైడ్రిన్  పరీక్ష నిర్వహణకు అనుమతి  కోసం  సీబీఐ  అధికారులు   ఈ ఏడాది మే  12  సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ విషయమై  నాంపల్లి సీబీఐ  కోర్టు  ఇవాళ  నిర్ణయం తీసుకుంది. 

2019  ఏప్రిల్  14వ తేదీ  రాత్రి  వైఎస్  వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు. అయితే  హత్యకు  ముందు  వైఎస్ వివేకానందరెడ్డి  రాసినట్టుగా  ఉన్న లేఖ  లభ్యమైంది. ఈ లేఖపై ఇప్పటికే  2021  ఫిబ్రవరి 21న  ఢిల్లీలోని  సీఎఫ్ఎస్ఎల్  ఒక నివేదికను ఇచ్చింది.  తీవ్ర ఒత్తిడిలో  ఉన్న సమయంలో  వైఎస్ వివేకానందరెడ్డి ఈ లేఖ  రాసినట్టుగా  ఆ నివేదిక తెలిపింది. అయితే  వైఎస్  వివేకానందరెడ్డి  రాసిన లేఖపై  వేలిముద్రలను గుర్తించేందుకు   నిన్ హైడ్రిన్  పరీక్ష  నిర్వహణకు  గాను  సీబీఐ  నిర్ణయం  తీసుకొంది. ఈ మేరకు కోర్టు అనుమతిని  కోరింది.  సీబీఐ  అభ్యర్ధనకు కోర్టు  తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios