ఐఆర్ఎష్ అధికారి కృష్ణ కిషోర్‌పై  విధించిన సస్పెన్షన్ ను మంగళవారం ానాడు క్యాట్ రద్దు చేసింది. 


అమరావతి: ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌కు మంగళశారం నాడు క్యాట్‌లో ఊరట లభించింది. కృష్ణ కిషోర్ పై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేసింది. కేంద్ర సర్వీసులకు కృష్ణ కిషోర్ వెళ్లేందుకు క్యాట్ అనుమతి ఇచ్చింది. 

ఏపీ ప్రభుత్వం ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్‌పై సస్పెన్షన్ విధించింది. తనపై సస్పెన్షన్ విధించడాన్ని క్యాట్‌పై ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ పై సస్పెన్షన్ విధించింది. దీంతో కృష్ణ కిషోర్ ‌క్యాట్ ను ఆశ్రయించారు.

Also read:ఆ అధికారం జగన్‌కు లేదు: కృష్ణకిశోర్‌ వ్యవహారంపై బాబు కామెంట్

కృష్ణ కిషోర్‌పై ఉన్న కేసులను చట్టపరంగా ప్రభుత్వం పరిశీలించుకోవచ్చని క్యాట్ ఏపీ సర్కార్‌కు సూచించింది. ఏపీలో చంద్రబాబునాయుుడు సీఎంగా ఉన్న సమయంలో ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నట్టుగా వైసీపీ ఆరోపణలు చేసింది.జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణ కిషోర్చ పై సస్పెన్షన్ విధించింది.