కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై హైదరాబాద్ బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఆయనపై హైదరాబాద్ బేగంబజార్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు నారాయణ స్వామిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేత మల్లు రవి ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. 

కాగా.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఏపీలో వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ మరణంపై సోనియాని దోషిగా చిత్రీకరిస్తూ నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారు. అలాగే తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుసుకున్న తర్వాత ఉప ముఖ్యమంత్రి మరింత రెచ్చిపోయారు. సోనియా, చంద్రబాబు కలిసి వైఎస్ఆర్‌ని హెలికాఫ్టర్ ప్రమాదంలో చంపారనే సందేహం ప్రజల్లో వుందని వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తిని సోనియాతో కలిసి బాబు హింసించారని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పూ చేయని జగన్‌ని అక్రమ కేసుల్లో ఇరికించారని, 16 నెలలు జైల్లో పెట్టి హింసించారని చెప్పారు. అప్పుడు స్పందించని కాంగ్రెస్ నేతలు, ఇప్పుడెందుకు తనపై కేసు పెట్టారంటూ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.