విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కాల్ మనీ కేసు వివాదం మరోసారి కలకలం రేపుతున్నాయి. గతంలో విజయవాడ కేంద్రంగా  కాల్ మనీ కేసులు భారీగా నమోదు కావడం సంచలనంగా మారింది. 

తాజాగా విజయవాడలో మరోసారి కాల్ మనీ కలకలం రేపింది. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తి ఆస్తులు రాయించుకున్నారు కాల్ మనీ కేటుగాళ్లు. లక్ష్మణ్ రావు అనే వ్యక్తి డబ్బులు అప్పుకు తీసుకున్నారు. 

వడ్డీ కట్టకపోవడంతో లక్ష్మణరావు ఆస్తులను రాయించేసుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన లక్ష్మణరావు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంటల్లో కాలిపోతున్న తండ్రిని రక్షించేందుకు కుమార్తె ప్రయత్నించింది. ఆమె కూడా గాయాలయ్యాయి. ఇద్దరూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.