జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన దివంగత  డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ర్లమెంట్ ప్రసంగాల సంకలనం 'పెద్దల సభలో తెలుగు పెద్ద' పుస్తకావిష్కరణ కార్యక్రమం తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజ్యసభ పూర్వ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సేకరించిన సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... సినారె గారు రాసిన పుస్తకాన్ని తన చేతితో ఆవిష్కరించడం తన  అదృష్టమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ముఖ్య అతిథి గా జాతీయ జ్యుడిషియల్ అకాడెమి డైరెక్టర్ జస్టిస్ గోడ రఘురాం. రైతు నేస్తం పబ్లికేషన్స్ కి చెందిన డాక్టర్ యడ్లవల్లి వేంకటేశ్వర్ రావు పాల్గొన్నారు.