కర్నూల్: కేసీఆర్‌కు కర్ణాటక రాష్ట్ర జలదోపీడీని అరికట్టే ధైర్యం లేదని కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాయలసీమ నేతలపై కేసీఆర్  ఉన్మాదిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు  ఆలంపూర్‌లో జరిగిన సభలో  బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై  గతంలో తాను చేసిన కామెంట్స్ ను ప్రస్తావించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై  బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందించారు.

రాయలసీమ నేతలపై కేసీఆర్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని బైరెడ్డి ఆరోపించారు. కర్ణాటక జల దోపీడీని అరికట్టే ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు  కేసీఆర్  రాయలసీమ వారిని తిడుతున్నారన్నారు.

ఆర్డీఎస్  కాలువ నీళ్లు ఎక్కడికి పోతాయో కూడ కేసీఆర్ తెలియదన్నారు. ఓటమి భయం పట్టుకొందన్నారు. ఈ భయంతోనే కేసీఆర్  మాట్లాడుతున్నారని చెప్పారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు  కేసీఆర్ కథ చెబుతానని చెప్పారు.