కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు పల్టీలు కొట్టినా, ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

"

వివరాల్లోకి వెడితే.. గుడివాడ డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఉంగుటూరు మండలం మానికొండ దగ్గర పంట పొలాలల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆర్టీసీ బస్సు పల్టీలు కొట్టింది. 

ప్రమాద సమయంలో బస్సులో విజయవాడ నుంచి గుడివాడకు వెల్తున్న 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మానికొండ గ్రామ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పంటపొలాల్లోకి పల్టీలు కొట్టింది. 

అయితే ఈ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంలో పెను ప్రమాదం తప్పింది. బస్సు యాక్సిడెంట్ అవ్వడానికి గల కారణాలు తెలియరాలేదు.