విశాఖ ఏజెన్సీ‌లోని చింతపల్లిలో భార్య కళ్ళ ఎదుటే భర్తను ప్రత్యర్ధులు నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి దారుణంగా చంపారు. వరుసకు బామ్మర్థులైన బచ్చేలవెనం గ్రామానికి చెందిన సిందేరి పెంటయ్య, నాగేశ్వరరావులు ఈ దారుణానికి పాల్పడ్డారు.

విశాఖ ఏజెన్సీ‌లో (visakha agency) పాతకక్షలు భగ్గుమన్నాయి. చింతపల్లిలో (chintapally ) భార్య కళ్ళ ఎదుటే భర్తను ప్రత్యర్ధులు నాటు తుపాకీతో కాల్చి అనంతరం కత్తితో పొడిచి దారుణంగా (murder) చంపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కిటుముల పంచాయతీ పరిధిలోని బూసిబంద గ్రామ శివారులో ఈ దారుణం చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే.. బూసిబంద గ్రామానికి చెందిన పాంగి సుమంత్ (50) తన భార్య రస్సు‌తో కలిసి పెదబయలులోని బంధువుల ఇంటికి వెళ్లారు. వేడుక ముగిసిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తన స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ సంగతి తెలుసుకున్న సమీప బంధువులు సుమంత్‌ పై దాడి చేశారు. ఊరికి దగ్గరలోని కొండ దిగుతున్న క్రమంలో వరుసకు బామ్మర్థులైన బచ్చేలవెనం గ్రామానికి చెందిన సిందేరి పెంటయ్య, నాగేశ్వరరావు లు మాటువేసి నాటు తుపాకితో కాల్చి, అనంతరం కత్తితో దాడిచేసి దారుణంగా హతమార్చారు.

మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. హత్య అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం కలిగించింది. తన కళ్ళెదుటే భర్త దారుణ హత్యకు గురికావడంతో భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.