అమరావతి: రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ఆద్యుడని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన వైసిపిపై విమర్శల వర్షం కురిపించారు. 

నెత్తిన తాటికాయ పడిన గుంటనక్క లాగా విజయసాయి రెడ్డి 420 తాతయ్య ట్విట్టర్ లో మూలుగుతూ ఉంటారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డిని చూసినా, ఆయన మాటలు విన్నా  పత్తిత్తే గుర్తుకు వస్తుందని టీడీపి ఎమ్మెల్సీ అన్నారు. 

రాజకీయ హింసలో పిహెచ్ డీ చేసినోళ్ల వైపు నిలబడి నీతులు మాట్లాడితే ఎలా అని ఆయన విజసాయి రెడ్డిని ప్రశ్నించారు. చంద్రబాబు రాజకీయ హింసను ప్రారంభించి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి విజయసాయి రెడ్డి ఉండేవారు కాదేమోనని ఆయన అన్నారు. 

ముందు మీ మూతులకు, చేతులకు అంటిన రక్తాన్ని తుడుచుకోండని బుద్ధా వెంకన్న విజయసాయి రెడ్డికి హితవు పలికారు. విజయసాయి రెడ్డి నిత్యం ట్విట్టర్ లో చురుగ్గా ఉంటూ టీడీపీపై, ఆ పార్టీ నేతలపై ఏదో విధమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు.