Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు పక్కన సగం కాలిన స్థితిలో మృతదేహం : బీటెక్ విద్యార్ధిగా గుర్తింపు... హత్యా, ఆత్మహత్యా..?

నెల్లూరు జిల్లా (nellore district) కావలిలో (kavarli) ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో (mysterious death) శవమై తేలాడు. మృతుడు ఉదయగిరి (udayagiri) నియోజకవర్గంలోని వింజమూరు (vinjamur) గ్రామానికి చెందిన రాజేందర్‌గా గుర్తించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు

btech student dead body found in kavali
Author
Kavali, First Published Nov 26, 2021, 9:20 PM IST

నెల్లూరు జిల్లా (nellore district) కావలిలో (kavarli) ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో (mysterious death) శవమై తేలాడు. కావలి పట్టణ పరిధిలోని తుమ్మలపెంట (thummalapenta highway) జాతీయ రహదారి పక్కన శుక్రవారం అతని మృతదేహం కనిపించింది. వివరాల్లోకి వెళితే.. కావలి జాతీయ రహదారిపై గస్తీ నిర్వహిస్తున్న మొబైల్‌ అధికారులు తుమ్మలపెంట జాతీయ రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించి .. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల  కోసం పరిశీలించారు.

మృతుడు చనిపోయిన ప్రదేశంలో సగం కాలిపోయిన సెల్‌ఫోన్‌ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా కీలక వివరాలు సేకరించారు. మృతుడు ఉదయగిరి (udayagiri) నియోజకవర్గంలోని వింజమూరు (vinjamur) గ్రామానికి చెందిన రాజేందర్‌గా గుర్తించారు. మృతుడు పట్టణంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రాజేందర్ వేసుకున్న దుస్తులు, శరీరం కొంతమేర కాలిపోవడంతో ఎవరైనా హత్య చేశారా? లేదా తానే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios