సీఎం జగన్ ఇంటి ముందు బాలుడి కలకలం.. అరెస్ట్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద శనివారం ఉదయం ఓ బాలుడు కలకలం సృష్టించాడు. జగన్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద శనివారం ఉదయం ఓ బాలుడు కలకలం సృష్టించాడు. జగన్ నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక బాలుడిని తాడేపల్లి పోలీసులు గుర్తించి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
పదేళ్ల వయసున్న ఆ బాలుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారిని సైతం ఎదురుప్రశ్నలు వేసి ముప్పతిప్పలు పెట్టాడు. తన పేరు శివకుమార్ అంటున్న ఆ కుర్రాడు.. తమది బాలతిమ్మయ్యగారి పల్లె అని చెబుతున్నాడు. ఈ గ్రామం ఏ జిల్లాలో, ఏ మండల పరిధిలో ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతానికి బాలుడిని శిశు సంరక్షణ కేంద్రం లేదా అనాథ బాలల ఆశ్రమానికి తరలించాలని నిర్ణయించారు. అయితే అనాథ ఆశ్రమానికి వెళ్లేందుకు బాలుడు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో అసలీ బాలుడు ముఖ్యమంత్రి ఇంటికి ఎలా వచ్చాడు, అతనితో మరెవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ నారాయణ తెలిపారు.