తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని యు. కొత్తపల్లి మండలం గొరసలో ఓ 12 యేళ్ల బాలుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత బాలుడి శవాన్ని చెట్టుకు ఉరివేసి వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నిన్న సాయంత్రం 4 గంటలకు బాలుడు అదృశ్యమయ్యాడు. అప్పటినుండి తల్లిదండ్రులు అతని గురించి వెతుకుతున్నారు. కాగా ఈ ఉదయం బాలుడు చెట్టుకు వేలాడుతూ శవమై కనిపించడంతో... చిన్నారిని చూసిన స్థానికులు గ్రామస్తులకు సమాచారం అందించారు.
ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకు చంపారు. చిన్నారిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది. పాతకక్షలా? ఏదైనా ఆస్తి గొడవలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.