ఎప్పటినుండో బొబ్బిలి  రాజకీయ చిత్ర పటంపై ఉన్న బొబ్బిలి రాజుల ముద్రను చెరపాలని చూస్తున్న బొత్స చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. తొలుత బొత్స, సుజయ కృష్ణ రంగారావు ఇరువురు కాంగ్రెస్ లోనే కొనసాగినప్పటికీ , రాజశేఖర్ రెడ్డి హయాంలో బొత్సకు మంత్రి పదవి దక్కడంతో బొత్స రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 

రాష్ట్ర విభజనానంతరం బొత్స కాంగ్రెస్ లోనే కొనసాగడంతో సుజయ వెళ్లి వైకాపాలో చేరి ఎన్నికల్లో గెలిచారు. కొంతకాలం తరువాత బొత్స కూడా వైసిపిలో చేరడంతో అలనాటి బొబ్బిలి యుద్ధ కాలం నుండి విజయనగర రాజులతో ఉన్న శత్రుత్వాన్ని కూడా పక్కకు పెట్టి, మంత్రి పదవి చేపట్టడానికి తెదాపాలో చేరారు సుజయ. 

ఎప్పటి నుండో బొబ్బిలి నియోజకవర్గంపై తన ముద్ర వేయాలని భావించిన బొత్స నాలుగుసార్లు ఓటమి చెందిన , మాజీ టీడీపీ విప్ అయిన వెంకట చిన అప్పలనాయుడుకు టికెట్ వచ్చేలా చూసి టిడిపిలో ఉన్న అంతర్గత వర్గ పోరును పూర్తి స్థాయిలో వినియోగించి విజయనగరం జిల్లాను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా వైకాపాలో తన ప్రాముఖ్యతను పెంచుకోవడమేకాకుండా తన తన చిరకాల వాంఛను కూడా తీర్చుకున్నారు.