శాసన సభలో పరిపాలనా వికేంద్రీకరణ బిల్ పెట్టినప్పుడే రాజధానిగా విశాఖ ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దుష్ట శక్తులు న్యాయస్థానాలకు వెళ్లి ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయని, దీని మీద న్యాయప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.  వీలైనంత త్వరలోనే అన్ని అడ్డంకులు దాటుకుని పరిపాలన రాజధానిగా విశాఖ నుంచి పాలన సాగనుందన్నారు.

కోవిడ్ తర్వాత సమావేశాలు ఎక్కడినుంచైనా నిర్వహించుకోవచ్చునని తెలిపారు. ఇంకా బొత్స మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా టిడిపి  ఏదో ఒక విమర్శ చేస్తోందన్నారు. రాష్ట్రంలో సమస్యలు, ఇతర అంశాలు చర్చించడానికి ఢిల్లీ వెళ్లారన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్ళేటప్పుడు  టిడిపి పార్టీ సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.  రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటి కోసం మాట్లాడరు...ఆనందయ్య మందు ఆన్ లైన్ లో ఇవ్వాలని వంటి వాఖ్యాలు చేస్తున్నారు. ఎప్పుడు చూసిన, సీఎం ఢిల్లీకి  కేసులు కొట్టి వేయాలని అడగడానికి వెళ్తున్నారు అని విమర్శ చేస్తున్నారన్నారు.

కరోనా థర్డ్‌వేవ్‌‌‌ను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం: హైకోర్టుకు ఏపీ సర్కార్...

రైతులు నుంచి ధాన్యాని నూటికి నూరు శాతంకొంటున్నామని, గత ప్రభుత్వాలు చేయలేని విధంగా మేము చేస్తున్నామన్నారు. ధాన్యానికి అధిక గిట్టు బాటు ధర ఇస్తోంది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే...ఇంటి పన్నులు పెంపు పై ప్రతి పక్షాలు, అనుబంధ సంస్ధలు రాద్ధాంతం చేస్తున్నారు. 

పన్ను పెంపు పై ఎన్నికల ముందే చట్టం చేసాం. శాసన సభ లో ఈ అంశాన్ని వెల్లడించాం. ఇంతకు ముందు అద్దెను బట్టి పన్ను విధించే వాళ్ళం. దీని వల్ల వ్యవస్థలో అక్రమాలకు ఆస్కారం ఉంది. అందుకే ఆస్తి విలువ మీద పన్ను వేసే విధానం తీసుకుని వచ్చాం.

అపార్టుమెంట్ అసోసియేషన్ అభిప్రాయాలు తెలుసుకొని అప్పుడు శాసన సభ లో దీనిపై చట్టం చేసాం. నివాస భవనాలకు 0.10 నుంచి 0.50 వరకు, నివాసేతర భవనాలకు 0.20 నుంచి 2 శాతం పన్ను వేశాం. ఇంటి పన్ను విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు.

అన్ని రాష్ట్రాలలో విధానాలు పన్ను విధానం  పరిశీలించాం. మొత్తం అంతా కలిపి 15 శాతం మించి పెరగదు. శాసన సభ్యుడు బుచ్చయ్య చౌదరి సందేహం వ్యక్తం చేస్తే నివృత్తి చేసాం. అసోసియేషన్ లతో మాట్లాడినప్పుడు 25  శాతం మించి పెంచ వద్దు అంటే ..మేము 15 శాతం మాత్రమే పన్ను ఉంటుందని స్పష్టం చేసాం.

ప‌రిశ్ర‌మ‌ చంద్ర‌బాబుది... ప్ర‌చారం జ‌గ‌న్‌ది... సొమ్మొక‌డిది సోకొక‌డిది: లోకేష్ సీరియస్...

స్థానిక సంస్థలు యూజర్ చార్జీలు వసూలు చేసుకోవచ్చని చెప్పాం. చిన్న ప్రాంతాల్లో నెలకు 30 రూపాయలు మించి యూజర్ ఛార్జ్ వేయవద్దని చెప్పాం. ఇంటి యజమానులు అద్దెకు ఎప్పుడు..పరిమితి లేదు కదా.

ఇంటి యజమానుల ఇప్పటి వరకు కడుతున్న ఇంటి పన్ను కు 15 శాతం లోపు ఉంటుంది ప్రస్తుత పన్ను ఉంటుంది. అంతకు మించి ఎవ్వరు కట్టవద్దు. త్వరలో ఇంటికి మూడు డస్ట్ బిన్ లు ఇస్తాం.

క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ పేరిట కార్యక్రమాన్ని వై ఎస్ ఆర్ పుట్టిన రోజు నుంచి మొదలు పెడతాం. ఏ రోజు శాసన సభ లో మూడు రాజధానులు ప్రకటించామో
ఆనాడే రాజధాని ప్రక్రియ మొదలు పెట్టాం అన్నారు.