తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం సృష్టించింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. తాడేపల్లి మండలం కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద రైలును నిలిపివేసిన అధికారులు సుమారు రెండు గంటల పాటు అణువణువునా గాలించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.