సామర్లకోట:తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో సోమవారం నాడు ఉదయం  పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

మేడపాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది.పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు కారణంగా ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని  వైద్యులు ప్రకటించారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ పేలుడు కారణంగా భారీగా శబ్దం విన్పించింది. దీంతో స్థానికులు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. బాణసంచా ఫ్యాక్టరీలో మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.