Asianet News TeluguAsianet News Telugu

విశాఖ కేజీహెచ్ లో బ్లాక్ ఫంగస్ కలకలం...! 35యేళ్ల మహిళలో గుర్తింపు..!!

కరోనా నుంచి కోలుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ జనాల్ని వణికిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులో ఏపీలోనూ బయటపడుతున్నాయి. 

black fungus symptoms in a woman in visakha kgh - bsb
Author
Hyderabad, First Published May 17, 2021, 10:58 AM IST

కరోనా నుంచి కోలుకున్నవారిని బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనాకు తోడు ఈ బ్లాక్ ఫంగస్ జనాల్ని వణికిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ కేసులో ఏపీలోనూ బయటపడుతున్నాయి. 

విశాఖపట్నంలో తాజాగా ఓ బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. విశాఖ నగరంలోని మధురవాడకు చెందిన ఒక ముప్పయి అయిదేళ్ళ మహిళ బ్లాక్ ఫంగస్ లక్షణాలతో కేజీహెచ్ కి రావడంతో డాక్టర్లు అది ఆ వ్యాధే అని నిర్దారించారు.

ఇదిలా ఉంటే విశాఖలో బ్లాక్ ఫంగస్ తొలి కేసుగా దీన్ని భావిస్తున్నారు. కరోనా వైరస్ నయం కావడానికి వాడే అతి మోతాదు మందుల పర్యవశానంగానే బ్లాక్ ఫంగస్ వస్తోందని వైధ్య రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్ తొలి కేసు వెలుగు చూడడంతో విశాఖ నగరం వణుకుతోంది.

కాగా, తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్‌ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఫంగస్ లక్షణాలు వున్న వారిని వైద్యులు గుర్తించారు. తాజాగా ఏపీలోని పలు జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ మరణాలు నమోదవుతున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ కేసులను ఇంకా ధృవీకరించలేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

ఏపీలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు: నిడదవోలు వ్యక్తిలో లక్షణాలు, స్థానికుల్లో ఆందోళన...

నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యే సమయానికే ఆయన కన్ను బాగా వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది.

దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. వీటిని బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ ఫంగస్ వ్యాపించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబీకులు తీవ్ర ఆందోళన పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios