Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు, బాధితుడి మృతి...

అమరావతి : కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందాడు. దీనిపై కలెక్టర్ ఇంతియాజ్  విచారణకు ఆదేశించారు. 

black fungus death in krishna district - bsb
Author
hyderabad, First Published May 18, 2021, 3:11 PM IST

అమరావతి : కృష్ణా జిల్లాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు బయటపడింది. ఉయ్యురుకి చెందిన పంచాయితీ కార్యదర్శి బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందాడు. దీనిపై కలెక్టర్ ఇంతియాజ్  విచారణకు ఆదేశించారు. 

మృతుడు కాటూరు పంచాయితీ కార్యదర్శి బాణవతు రాజశేఖర్. మొదట అతను కొవిడ్‌తో మృతి చెందినట్లు భావించారు. తర్వాత బ్లాక్ ఫంగస్‌తో రాజశేఖర్ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. 

మృతుడి స్వస్థలం ఏ కొండూరు మండల గొల్లమందల గ్రామంగా తెలుస్తోంది. దీంతో బ్లాక్‌ ఫంగస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

కాగా, ప్రకాశం జిల్లాలోనూ షేక్ బాషా అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. 20 రోజుల క్రితం కోవిడ్ సోకడంతో ఆస్పత్రిలో చేరిన షేక్ బాషా.. కరోనానుంచి కోలుకున్నారు.

ఆ తరువాత బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఒంగోలుకు.. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యలు చెప్పారు.

అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. బాషా మృతితో ప్రకాశం జిల్లాలో బ్లాక ఫంగస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది. 

అలాగే, నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లిలో బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. మొదట అతనికి ఈ లక్షణాలున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయ్యే సమయానికే ఆయన కన్ను బాగా వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది. ఆ తరువాత అతను మృతి చెందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios